Our identity
Logo design backstory
Our MAHA logo was designed by Sri Thimmaraju Vishwapathi Ramakrishna Murthy, popularly known as Vishwapathi Kalam—a Telugu writer and renowned logo designer.
With gratitude
On behalf of MAHA Co-operative Society, we express our special thanks to Sri Vishwapathi for designing our logo.
Story
About the designer (English & Telugu)
The same story is provided below in English and Telugu.
English
Sri Thimmaraju Vishwapathi Ramakrishna Murthy, popularly known as Vishwapathi Kalam, was a Telugu writer who wrote 25 spiritual books. He designed our Maha Logo.
Features of life
He was born in 1956 to Brahmasri Tammiraju Lakshmi Narasimha Rao and Naga Ratnamba in Eluru, Andhra Pradesh. He studied in Nagarjuna Sagar, Hyderabad and Warangal. He completed his M.Tech from Warangal Regional Engineering College in 1983 and worked at Alvin Company till 1988 and then at Matrushri Engineering College till 1998.
Vishwapathi drew cartoons in the Indian Express from 1984 to 1990. He has been in the field of logo design since 1998 and has designed logos for more than six thousand companies worldwide. His spiritual books are read by crores of people worldwide.
Venkateswara Vratakalpam, written by him in 2005, has been translated into twelve languages including French and Italian. His specialty is suggesting names and designing logos for companies based on Vedic scriptures.
Thimmaraju Vishwapathi Ramakrishnamurthy has placed 10 books on Sri Venkateswara Swamy in the prestigious Harvard University library in America. This is the first time that Telugu books on Sri Venkateswara Swamy have been placed in this library.
TVRK Murthy, popularly known as Vishwapathi Kalam, has written 25 spiritual books. It is noteworthy that 15 of these books are on Srinivasa.
On behalf of the Mahala-Operative Society, we express our special gratitude to Sri Thimmaraju Vishwapathi.
తెలుగు
శ్రీ తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణ మూర్తి తెలుగు రచయిత, విశ్వపతి కలం పేరుతో ప్రసిద్ధులైన ఆయన 25 ఆధ్యాత్మిక పుస్తకాలు రచించారు. వీరు మా మహా లోగోను డిజైన్ చేశారు.
జీవిత విశేషాలు
ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరులో బ్రహ్మశ్రీ తమ్మిరాజు లక్ష్మి నరసింహరావు, నాగ రత్నాంబ దంపతులకు 1956లో జన్మించారు. విద్యాభ్యాసం నాగార్జున సాగర్, హైదరాబాద్, వరంగల్లో జరిగింది. 1983లో వరంగల్ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజి నుండి ఎం.టెక్ చదివి 1988 దాకా ఆల్విన్ కంపెనీలోను, తరువాత 1998 వరకు మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేసారు.
విశ్వపతి 1984 నుండి 1990 వరకు ఇండియన్ ఎక్స్ప్రెస్లో కార్టూన్లు వేశారు. 1998 నుంచి లోగో డిజైన్ రంగంలో ఉన్న ఆయన ఇప్పటి వరకూ ప్రపంచ వ్యాప్తంగా ఆరువేలకు పైగా కంపెనీలకు లోగోలు డిజైన్ చేశారు. ఆయన రాసిన ఆధ్యాత్మిక పుస్తకాలను ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది చదువుతున్నారు.
2005 లో ఆయన రాసిన వేంకటేశ్వర వ్రతకల్పం ఫ్రెంచ్, ఇటాలియన్ సహా పన్నెండు భాషల్లో అనువాదం అయ్యింది. వేదశాస్త్రాల ఆధారంగా కంపెనీల పేర్లు సూచించటం, లోగోలు డిజైను చేయటం ఈయన ప్రత్యేకత.
తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తి శ్రీ వేంకటేశ్వర స్వామిపై రచించిన 10 పుస్తకాలను అమెరికాలోని ప్రతిష్టాత్మక హార్వర్డ్ విశ్వ విద్యాలయం లైబ్రరీలో ఉంచారు. శ్రీ వేంకటేశ్వర స్వామి వారిపై ఈ స్థాయిలో తెలుగు పుస్తకాలను ఈ లైబ్రరీలో ఉంచడం ఇదే ప్రథమం.
విశ్వపతి కలం పేరుతో ప్రసిద్ధులైన టీవీఆర్కే మూర్తి 25 ఆధ్యాత్మిక పుస్తకాలు రచించారు. వీటిలో 15 పుస్తకాలు శ్రీనివాసుని పైనే కావడం డం విశేషం.
శ్రీ తిమ్మరాజు విశ్వపతి గారికి మహాళ-ఆపరేటివ్ సొసైటీ తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము.